
‘బాహుబలి: ది ఎపిక్’ రీ-రిలీజ్ ప్రమోషన్లలో ప్రభాస్ వాయిస్ ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. ఈ తాజా ఇంటర్వ్యూలలో ఆయన గొంతు బొంగురుపోయి, జలుబు కారణంగా చాలా భిన్నంగా వినిపిస్తోంది. అయితే, అభిమానుల దృష్టి ఆయన అనారోగ్యంపై కన్నా, ‘స్పిరిట్’ ఆడియో గ్లింప్స్‌తో పోల్చి చూడటంపై పడింది.
ఆ ‘సౌండ్ స్టోరీ’లో ప్రభాస్ వాయిస్ చాలా పవర్‌ఫుల్, స్పష్టంగా, గంభీరంగా ఉంది. కానీ, ప్రస్తుతం వినిపిస్తున్న ఆయన రియల్ వాయిస్‌కు, ఆడియో గ్లింప్స్‌లోని వాయిస్‌కు అస్సలు పొంతన లేకపోవడం గమనార్హం.
ఈ తేడా, గతంలో వచ్చిన ఓ బలమైన రూమర్‌కు మళ్లీ ఊపిరి పోసింది. అదే.. ‘స్పిరిట్’ ఆడియో గ్లింప్స్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో సృష్టించారన్న ప్రచారం.
నటీనటులు భౌతికంగా లేకుండా, కేవలం వారి గొంతులను AI ద్వారా జనరేట్ చేసి టీజర్‌ను వదలడం నిజంగా ఓ కొత్త ప్రయోగం. బహుశా ప్రభాస్ బర్త్‌డే నాటికి ఆయన అందుబాటులో లేకపోవడం వల్లే దర్శకుడు సందీప్ వంగా ఈ టెక్నాలజీని వాడి ఉంటారని చాలామంది ఫిక్స్ అవుతున్నారు.
అయితే, మరికొందరు ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. ఆడియో గ్లింప్స్‌ను ఎప్పుడో రికార్డ్ చేసి ఉంటారని, అప్పటి వాయిస్‌కు, జలుబు చేసిన ఇప్పటి వాయిస్‌కు తేడా ఉండటం సహజమేనని వాదిస్తున్నారు.
ఏది ఏమైనా, ఈ వాయిస్ వ్యత్యాసం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ AI ప్రయోగం వెనుక అసలు నిజం ఏమిటనేది దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకే తెలియాలి.
