
న్యూస్ డెస్క్: టీమిండియా మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ మంధాన ఆసుపత్రి నుంచి క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం ఛాతి నొప్పితో ఆయన హుటాహుటిన ఆసుపత్రిలో చేరడంతో, స్మృతి సంగీత దర్శకుడు పలాశ్ ముచ్ఛల్ల వివాహం వాయిదా పడింది.
శ్రీనివాస్ ఆరోగ్యం పూర్తిగా నిలకడగా ఉందని, ఆయనకు గుండెపోటు కాకుండా ఆంజినా (Angina) సమస్య ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముందు జాగ్రత్త చర్యగా యాంజియోగ్రఫీ నిర్వహించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
తండ్రి కోలుకునే వరకు వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేయాలని స్మృతి నిర్ణయించుకుంది. ఆమె తండ్రికి చాలా దగ్గరగా ఉండటం ఈ నిర్ణయానికి కారణం. కాగా, స్మృతి కాబోయే భర్త పలాశ్ కూడా అస్వస్థతకు గురై డిశ్చార్జ్ అయ్యారు.
అయితే, సోషల్ మీడియాలో మరో ప్రచారం జరుగుతోంది. తండ్రి అనారోగ్యం మాత్రమే కాకుండా, పలాశ్ మరో అమ్మాయితో చాటింగ్ చేసిన విషయం స్మృతికి తెలిసిందని పెద్ద ఎత్తున రూమర్లు వినిపిస్తున్నాయి.
ఈ ప్రచారంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు స్మృతి ‘జస్ట్ మిస్సయ్యింది’ అని కామెంట్లు చేస్తుంటే, మరికొందరు ఇదంతా తప్పుడు ప్రచారం అని ఖండిస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో, రెండు కుటుంబాలు ప్రస్తుతం ఆరోగ్యంపైనే దృష్టి పెడుతున్నాయని తెలుస్తోంది. వీరి వివాహానికి సంబంధించిన సరికొత్త తేదీ ప్రకటన ‘ఏ విధంగా’ ఉండబోతోంది అనేది ఇప్పుడు అత్యంత ఆసక్తిగా మారింది.
