Tuesday, December 16, 2025
HomeMovie News'శివ' రీ-రిలీజ్.. 36 ఏళ్ల తర్వాత థియేటర్లలో అవే వైబ్రేషన్స్!

‘శివ’ రీ-రిలీజ్.. 36 ఏళ్ల తర్వాత థియేటర్లలో అవే వైబ్రేషన్స్!

siva-movie-4k-re-release-nagaarjuna-rgv

36 ఏళ్ల తర్వాత, తెలుగు సినిమా చరిత్రను “బిఫోర్ శివ, ఆఫ్టర్ శివ”గా మార్చేసిన కల్ట్ క్లాసిక్ ‘శివ’ మళ్లీ థియేటర్లలోకి వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ 50వ వార్షికోత్సవం సందర్భంగా నాగార్జున ఈ చిత్రాన్ని 4K వెర్షన్‌లో గ్రాండ్‌గా విడుదల చేశారు.

ఇది కేవలం పాత ప్రింట్‌ను రీ-రిలీజ్ చేయడం కాదు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ 4K వెర్షన్ కోసం మరో 8 నెలలు శ్రమించారు, సౌండ్, విజువల్స్‌ను నేటి టెక్నాలజీకి తగ్గట్లు అప్‌గ్రేడ్ చేశారు.

ఈ సినిమా కోసం నాటి అభిమానులే కాదు, ఈ తరం యువత కూడా ఆసక్తిగా ఎదురుచూశారు. ‘శివ’ గొప్పతనం గురించి వినడమే తప్ప చూడని వారు, ఆ మ్యాజిక్‌ను బిగ్ స్క్రీన్‌పై ఎక్స్‌పీరియన్స్ చేసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు.

హైదరాబాద్‌లో బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. 36 ఏళ్ల క్రితం ఏ దేవి థియేటర్‌లో అయితే ‘శివ’ విడుదలైందో, అదే థియేటర్‌లో ఆర్జీవి, ఇతర ప్రముఖులతో కలిసి సినిమా చూడటం విశేషం.

ఇటీవల కాలంలో రీ-రిలీజ్‌ల ట్రెండ్ కాస్త తగ్గింది. కానీ ‘శివ’ మాత్రం ఆ ట్రెండ్‌ను బ్రేక్ చేసి, సరికొత్త బజ్ క్రియేట్ చేసింది. ఈ రెస్పాన్స్ అక్కినేని ఫ్యాన్స్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

‘శివ’ రీ-రిలీజ్‌కు వస్తున్న ఈ అపూర్వ స్పందన, నాగార్జున తన 100వ సినిమా విషయంలో తీసుకోబోయే నిర్ణయంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular