Friday, January 16, 2026
HomeMovie Newsశర్వానంద్: 'బైకర్' వాయిదా.. సంక్రాంతికి 'నారి నారి' వస్తుందా?

శర్వానంద్: ‘బైకర్’ వాయిదా.. సంక్రాంతికి ‘నారి నారి’ వస్తుందా?

sharwanand-biker-postponed-nari-nari-naduma-murari-sankranti-release-doubt

యువ హీరో శర్వానంద్ నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నెల 6న రిలీజ్ కావాల్సిన ‘బైకర్’సినిమా అనుకోని కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. కొంత వర్క్ పెండింగ్ ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాతో పాటు శర్వానంద్ ‘నారి నారి నడుమ మురారి’ సినిమాను సంక్రాంతికి రిలీజ్‌కు లాక్ చేశారు. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రాం అబ్బరాజు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

సంక్రాంతి ఫైట్ గట్టిగా ఉన్న కారణంగా పొంగల్‌కు ఈ సినిమా వస్తుందా లేదా అన్న సందేహం మొదలైంది. ఒకవేళ నారి నారి నడుమ మురారి కూడా సంక్రాంతి మిస్ అయితే, ఆ సినిమా మళ్లీ నెక్స్ట్ మంత్ రిలీజ్ కుదిరే ఛాన్స్ ఉండదు. సో 2026 సమ్మర్‌లోనే ఆ సినిమా రిలీజ్ ఉంటుంది.

నిజానికి, బైకర్ సినిమా కోసం శర్వానంద్ చాలా కష్టపడ్డాడు. తెలుగు తెర మీద బైక్ రైడింగ్ నేపథ్యంలో ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదని మేకర్స్ అంటున్నారు. బైకర్ ఫిబ్రవరిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.

సినిమాల రిలీజ్ విషయంలో ఇలా వాయిదాలు జరిగితే ఆడియన్స్‌లో ఆ సినిమా మీద ఉన్న ఇంట్రస్ట్ తగ్గిపోతుంది. ఈ విషయంలో శర్వానంద్ జాగ్రత్త పడాల్సిందే. శర్వానంద్ మనమే తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఈ రెండు సినిమాలు చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular