
న్యూస్ డెస్క్: క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్‌తో పోలిస్తే పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) ఆర్థికంగా చాలా చిన్నది. ఒకప్పుడు పీఎస్ఎల్ ఆడింది ఐపీఎల్ ఛాన్స్ కోసమే. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. సీనియర్ స్టార్లు ఐపీఎల్ వేలానికి దూరంగా ఉండి పీఎస్ఎల్ వైపు చూస్తున్నారు.
సీనియర్ ఆటగాళ్లు ఫాఫ్ డు ప్లెసిస్ మొయిన్ అలీ వంటి వారు 2026 ఐపీఎల్ వేలానికి దూరంగా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ‘అన్ సోల్డ్’ భయమే. ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోకపోతే, వారి బ్రాండ్ వాల్యూ పడిపోతుంది.
తాజాగా గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా రానున్న ఐపీఎల్ మినీ వేలంలో పాల్గొనడం లేదు. ఐపీఎల్ రిజెక్ట్, పీఎస్ఎల్ సెలెక్ట్ అనే ఈ ట్రెండ్‌ను గతంలో డేవిడ్ వార్నర్ కేన్ విలియమ్సన్ మొదలుపెట్టారు.
ఐపీఎల్ యువ ఆటగాళ్లకు ‘గోల్డ్ మైన్’ లాంటిది. అక్కడ ఆడితే లైఫ్ సెటిల్ అవుతుంది. కానీ వయసు మీద పడి, రిస్క్ వద్దనుకునే వెటరన్ స్టార్లకు పీఎస్ఎల్ ఒక ‘ప్రీమియం రిటైర్మెంట్ హోమ్’ లా మారింది.
వార్నర్‌ను ఐపీఎల్ వేలంలో కొనకపోయినా, పీఎస్ఎల్‌లో అతనికి కెప్టెన్సీ మంచి గౌరవం దక్కాయి. ఈ ఉదాహరణతో డు ప్లెసిస్ వంటి వారు ఐపీఎల్ వేలం టెన్షన్ కంటే పీఎస్ఎల్ కాంట్రాక్టే బెటర్ అని భావిస్తున్నారు.
మొత్తానికి డబ్బు క్రేజ్ విషయంలో ఐపీఎల్ దరిదాపుల్లో కూడా పీఎస్ఎల్ లేకపోయినా.. అన్ సోల్డ్ భయంతో సీనియర్లు పాక్ లీగ్ వైపు వెళ్లడం ఖాయం.
