
న్యూస్ డెస్క్: సీనియర్ నటుడు శరత్ కుమార్ తన డ్రీమ్ రోల్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ బయోపిక్‌లో నటించాలనే కోరిక తనకు చాలా కాలంగా ఉందని ఆయన ఆసక్తిని వ్యక్తం చేశారు.
అయితే, ఆ అవకాశం ఇప్పటివరకు రాలేదన్నారు. బోస్ పాత్ర కోసం ఆయన దర్శకుడిగానూ బాధ్యతలు తీసుకుంటారా అనేది ఇప్పుడు చూడాలి.
శరత్ కుమార్ కేవలం నటుడు మాత్రమే కాదు. ఆయన గతంలో 2015లో ‘సందామారుతం’ అనే సినిమాను డైరెక్ట్ చేశారు. కానీ ఆ తర్వాత దర్శకత్వం కొనసాగించలేదు.
ఇప్పుడు బోస్ బయోపిక్‌పై ఆశపడిన నేపథ్యంలో, నటుడిగానే కాకుండా ఆ బాధ్యతలను తానే తీసుకుంటారేమో అనే చర్చ జరుగుతోంది.
అయితే, నెటిజన్లలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం శరత్ కుమార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టర్నింగ్ తీసుకున్న నేపథ్యంలో, బోస్ పాత్రకు ఆయన సరితూగే నటుడు కాదన్నది కొందరి అభిప్రాయం. ఒకవేళ ఈ బయోపిక్ తీస్తే, అది పెద్ద ప్రాజెక్ట్‌గా, ప్రతిష్టాత్మకంగా ఉండాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.
