
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’పై అంచనాలు ఆకాశాన్నంటున్నాయి. ఇటీవలి ఆడియో టీజర్‌తోనే హైప్ క్రియేట్ చేసిన సందీప్, ఇప్పుడు కాస్టింగ్‌పై వస్తున్న రూమర్లతో వార్తల్లో నిలిచారు.
గత కొన్నాళ్లుగా, ఈ సినిమాలో ప్రభాస్‌కు తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారని గట్టిగా ప్రచారం జరిగింది. ఈ “మెగా” కాంబినేషన్ వార్తతో ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యారు.
అయితే, ఈ వార్తలపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా ఇంటర్వ్యూలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ‘స్పిరిట్’లో చిరంజీవి గారు నటించడం లేదని, ఆ వార్తలన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు.
కానీ, చిరంజీవి గారితో కచ్చితంగా భవిష్యత్తులో వేరే సినిమా చేస్తానని సందీప్ చెప్పడం విశేషం. ఇది మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు ఆశలు రేపింది.
ఇదే ఇంటర్వ్యూలో, సౌత్ కొరియన్ స్టార్ డాన్ లీ విలన్‌గా నటిస్తున్నారా? అని అడగ్గా, సందీప్ మాత్రం సమాధానం దాటవేశారు. ఈ మౌనమే అంగీకారమని, డాన్ లీ సినిమాలో ఉన్నారని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు.
‘స్పిరిట్’ ఈ నెలలో పూజా కార్యక్రమాలు జరుపుకుని, వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనుంది. త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటిస్తోంది. 60% BGM కూడా పూర్తయింది.
