
తెలంగాణ జవాన్ కర్నల్ సంతోష్ బాబు జీవితం ఇప్పుడు బాలీవుడ్ వెండితెరపై ప్రతిబింబించబోతుంది. 2020లో గల్వాన్ లోయలో తన ప్రాణాలను అర్పించిన ఈ దేశవీరుని కథను ఆధారంగా తీసుకుని బాలీవుడ్‌లో ఒక భావోద్వేగాత్మక యాక్షన్ డ్రామా రూపొందుతోంది.
భారత భద్రతా దళాల కోసం తన జీవితాన్ని అంకితంగా చేసిన ఈ తెలంగాణ సైనికుడిపై తెరకెక్కనున్న ఈ సినిమా ఇప్పటికే బజ్ క్రియేట్ చేస్తోంది.
ఈ సినిమాలో బీంగ్ హ్యూమన్ హీరో సల్మాన్ ఖాన్ ముఖ్యపాత్రలో కనిపించనున్నాడు. ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్ 3’ పుస్తకంలో పొందుపరచిన కథ ఆధారంగా ఈ స్క్రిప్ట్ రూపొందుతోంది.
అపూర్వా లాఖియా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాయడానికి సురేష్ నాయర్, చింతన్ గాంధీ జతకట్టారు. జూలై నుండి షూటింగ్ మొదలై 70 రోజుల షెడ్యూల్‌లో పూర్తి చేయాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది.
సల్మాన్ ఇప్పటికే ఆర్మీ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణలు తీసుకుంటున్నారని బీటౌన్ వర్గాలు పేర్కొంటున్నాయి. కర్నల్ సంతోష్ కుటుంబం కూడా ఈ బయోపిక్‌పై సానుకూలంగా స్పందించిందని తెలుస్తోంది. ఇది తాము గర్వపడే సంఘటనగా భావిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
SalmanKhan, SantoshBabu, BollywoodBiopic, GalwanHero, ArmyMovie,
