Thursday, February 12, 2026
HomeBig Storyవరుస సెంచరీలు: సౌతాఫ్రికాకు 359 పరుగుల మెగా టార్గెట్!

వరుస సెంచరీలు: సౌతాఫ్రికాకు 359 పరుగుల మెగా టార్గెట్!

ruturaj-gaikwad-virat-kohli-centuries-india-vs-south-africa-2nd-odi-358

న్యూస్ డెస్క్: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. రాయ్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ రుతురాజ్‌ గైక్వాడ్ శతకాలతో చెలరేగి భారీ స్కోరుకు పునాది వేశారు.

రుతురాజ్ తొలి సెంచరీ:

ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ తన వన్డే కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. మొదట్లో జాగ్రత్తగా ఆడి 52 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన గైక్వాడ్, ఆ తర్వాత వేగాన్ని పెంచాడు. మొత్తం 83 బంతుల్లో 12 ఫోర్లు 2 సిక్స్‌లతో 105 పరుగులు చేసి ఔటయ్యాడు.

కోహ్లీ క్లాసిక్ ఇన్నింగ్స్:

విరాట్ కోహ్లీ తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీ సాధించాడు. 90 బంతుల్లో శతకం పూర్తి చేసిన కోహ్లీ, మరో మైలురాయిని చేరుకున్నాడు. కోహ్లీ 93 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్స్‌లతో 102 పరుగులు చేశాడు. వన్డేల్లో వరుసగా రెండు మ్యాచుల్లో శతకం నమోదుచేయడం కోహ్లీకి ఇది 11వ సారి.

రాహుల్ మెరుపులు:

చివర్లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ మెరుపులు మెరిపించాడు. కేవలం 43 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్స్‌లతో 66 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రుతురాజ్-కోహ్లీ భాగస్వామ్యం టీమ్‌కు మంచి స్కోర్ అందించింది.

సౌతాఫ్రికా బౌలర్లు మార్కో యాన్సెన్, ఒట్నెయిల్ బార్ట్‌మాన్ తలో 2 వికెట్లు తీశారు. లుంగి ఎంగిడి నాండ్రే బర్గర్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular