Sunday, May 24, 2026
HomeInternationalపుతిన్ భారత్ పర్యటనపై భారీ కుట్ర.. అరెస్ట్ వదంతులకు అసలు కారణమిదే!

పుతిన్ భారత్ పర్యటనపై భారీ కుట్ర.. అరెస్ట్ వదంతులకు అసలు కారణమిదే!

russia-president-putin-india-visit-icc-arrest-warrant-conspiracy

న్యూస్ డెస్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నాలుగేళ్ల తర్వాత భారత్‌లో పర్యటించబోతున్నారు. డిసెంబర్ 4 5 తేదీల్లో జరిగే 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆయన ఢిల్లీకి వస్తున్నారు.

ఈ పర్యటన నేపథ్యంలో పుతిన్ అరెస్ట్ అవుతారా అనే పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఉక్రెయిన్‌లో యుద్ధనేరాలు చేశారన్న ఆరోపణలపై పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో భారత్‌లో దిగగానే ఆయనపై చర్యలు ఉంటాయేమోనని ప్రచారం జరిగింది.

అయితే, భారత్ ఈ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుపై సంతకాలు చేయలేదు. అందువల్ల ఐసీసీ నిబంధనలకు లోబడి భారత్ వ్యవహరించాల్సిన అవసరం లేదు. గతంలోనూ ఐసీసీ విచారణ ఎదుర్కొన్న నాయకులకు భారత్ ఆతిథ్యమిచ్చింది.

ఈ అరెస్ట్ పుకార్ల వెనుక అమెరికా చైనా వంటి దేశాల ప్రమేయం ఉందా అనే అనుమానాలు ఉన్నాయి. భారత్ రష్యాల మధ్య బంధం బలపడటాన్ని ఇరు దేశాలు జీర్ణించుకోలేక పోతున్నాయి. ఈ నేపథ్యంలో పర్యటనపై ఎన్నో సందేహాలు చుట్టుముడుతున్నాయి.

ఐసీసీ వారెంట్ జారీ చేశాక పుతిన్ ఇటీవల మంగోలియా పర్యటన చేపట్టారు. అక్కడ ఆయనకు భారీ స్వాగతం లభించింది. లైవ్ బ్యాండ్‌ మార్షల్ గీతాలతో మంగోలియా అధ్యక్షుడు ఘన స్వాగతం పలికారు.

పుతిన్ పర్యటనకు ఢిల్లీలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది భారత్ రష్యా మధ్య ఉన్న ‘స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్’ను మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular