
యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న మోగ్లీ సినిమా విడుదల వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. నిర్మలా కాన్వెంట్, బబుల్ గమ్ తర్వాత రోషన్ నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.
నేషనల్ అవార్డ్ విన్నర్ సందీప్ రాజ్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 12న రిలీజ్ కావాల్సి ఉంది.
అయితే అదే రోజు బాలకృష్ణ అఖండ 2 విడుదల కానుండటంతో, ఓపెనింగ్స్ దెబ్బతినకుండా ఉండేందుకు మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 25న కూడా అనేక చిత్రాలు ఉండటంతో పోటీని నివారించేందుకు మోగ్లీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం. దీనిపై మేకర్స్ మరికొన్ని గంటల్లో అఫీషియల్ ప్రకటన ఇవ్వనున్నారు.
