ఒకప్పుడు వెండితెరను ఏలిన స్టార్ హీరోయిన్, ఫైర్ బ్రాండ్ నేత ఆర్కే రోజా 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ మేకప్ వేసుకున్నారు. 90వ దశకంలో 100కు పైగా చిత్రాలతో గ్లామర్ క్వీన్‌గా వెలిగిన ఆమె, ఆ తర్వాత పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించారు.
వైసీపీలో కీలక నేతగా ఎదిగి, ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజా, ఇక సినిమాలకు దూరమైనట్లేనని అందరూ భావించారు. కానీ, అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రకటించారు.
రోజా తన పునరాగమనానికి ఒక తమిళ చిత్రాన్ని ఎంచుకోవడం విశేషం. ‘లెనిన్ పాండియన్’ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిల్మ్స్ నిర్మిస్తుండగా, బాలచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియోలో, ‘లెనిన్ పాండియన్’లోని ఆమె లుక్‌ను రివీల్ చేశారు. ఇందులో ఆమె ‘సంతానం’ అనే పవర్‌ఫుల్ పాత్రలో, పూర్తి డీ-గ్లామర్, సహజమైన లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు.
ఒకప్పటి గ్లామర్ ఐకాన్, ఇప్పుడు ఇలాంటి బలమైన పాత్రతో రీ-ఎంట్రీ ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా ముద్రపడిన ఆమె, వెండితెరపై రెండో ఇన్నింగ్స్‌లో ఎలా మెప్పిస్తారో చూడాలి.
