
న్యూస్ డెస్క్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలు గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారాయి. టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత, వన్డేలకూ సైలెంట్‌గా రిటైర్ అవుతాడా అన్న సందేహాలు వినిపించాయి. కానీ ఇప్పుడు రోహిత్ స్వయంగా ఇచ్చిన సంకేతాలు అభిమానుల్లో నూతన ఉత్సాహం రేపాయి.
టి20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాడు రోహిత్. అలాగే ఇంగ్లాండ్ సిరీస్ ముందు టెస్టుల నుంచి కూడా తప్పుకున్నాడు. దీంతో ఇక వన్డేలకూ ఆగిపోతాడా అన్న సందేహం మొదలైంది. ముఖ్యంగా అతని ఫిట్‌నెస్, వయసు కారణంగా చర్చలు మరింత వేగం పుంజుకున్నాయి.
అయితే, రోహిత్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటో ద్వారా క్లారిటీ ఇచ్చాడు. ప్యాడ్స్ కట్టుకుని వాకింగ్ చేస్తూ కనిపించిన రోహిత్, తాను ఇంకా సిద్ధంగా ఉన్నానని సంకేతం ఇచ్చాడు. దీన్ని చూసి అభిమానులు, విశ్లేషకులు అతడు 2027 వరల్డ్‌కప్ వరకు కొనసాగుతాడని అర్థం చేసుకుంటున్నారు.
ఇక వచ్చే నెల ఆస్ట్రేలియా సిరీస్‌కు జట్టు ఎంపిక కాబోతోంది. ఇప్పటికే రోహిత్ ఫిట్‌నెస్ టెస్టులు పాస్ అయ్యాడని సమాచారం. ఈ సిరీస్‌లోనే అతని భవిష్యత్తు స్పష్టమయ్యే అవకాశం ఉంది.
విరాట్ కోహ్లీ కూడా ఫిట్‌నెస్ టెస్ట్ పూర్తి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇద్దరూ కలిసి వన్డే జట్టులో కొనసాగబోతారని భావిస్తున్నారు. రోహిత్ ఇంకా టీమిండియాకు అవసరమని అభిమానులు చెబుతున్నారు.
మొత్తం మీద, రోహిత్ రిటైర్మెంట్ ఊహాగానాలు ఒక్క సోషల్ మీడియా పోస్ట్‌తో ముగిసిపోయాయి. అతను ఇంకా జాతీయ జట్టులో కొనసాగబోతున్నాడని స్పష్టమైంది.
