Monday, August 10, 2026
HomeTelanganaమోదీపై బీఆర్ఎస్ ఎంపీల మౌనం ఎందుకు అంటూ రేవంత్ విమర్శలు

మోదీపై బీఆర్ఎస్ ఎంపీల మౌనం ఎందుకు అంటూ రేవంత్ విమర్శలు

revanth slams brs mps for silence on farmers issue in parliament
revanth slams brs mps for silence on farmers issue in parliament

తెలంగాణ: రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని కఠినంగా నిలదీస్తూ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. యూరియా సరఫరా కావాలని రాష్ట్రం ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా స్పందన రాలేదని, ప్రధాని మోదీ ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇది తెలంగాణ రైతాంగంపై వివక్షకు నిదర్శనమని విమర్శించారు.

పార్లమెంట్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు గట్టిగా వాదించారని రేవంత్ ప్రశంసించారు. రైతుల తరఫున గళమెత్తిన ఎంపీ ప్రియాంక గాంధీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమయంలో కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. “రైతుల కోసం నిలబడాల్సిన వీరు తమ బాధ్యత మరిచి మోదీ భజనలో నిమగ్నమైపోయారు” అని వ్యాఖ్యానించారు.

ఇక బీఆర్ఎస్ ఎంపీల గైర్హాజరు తీరుపై రేవంత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “గల్లీలో గొడవలు పెట్టే బీఆర్ఎస్ నేతలు, ఢిల్లీలో రైతుల సమస్యలపై ఎందుకు మౌనం వహిస్తున్నారు? మోదీ అంటే భయమా లేక భక్తా?” అని నిలదీశారు.

రైతుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన సమయంలో బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో కనిపించకపోవడం బాధాకరమని రేవంత్ ఎద్దేవా చేశారు. రైతుల ఇబ్బందులు పరిష్కరించడానికి రాష్ట్రం, కేంద్రం మధ్య స్పష్టమైన చర్చలు జరగాలని ఆయన సూచించారు.

రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ నిలబడుతుందని, కేంద్రం నిర్లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు ఎండగడతామని సీఎం స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular