Sunday, October 4, 2026
HomeMovie Newsరీ-ఎంట్రీలో రేణు దేశాయ్ కొత్త సినిమా.. పవర్ఫుల్ క్యారెక్టర్ దక్కుతుందా?

రీ-ఎంట్రీలో రేణు దేశాయ్ కొత్త సినిమా.. పవర్ఫుల్ క్యారెక్టర్ దక్కుతుందా?

https://t.the2states.com/renu-desai-new-movie-16-rojula-panduga-powerful-role-expectation/

సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్ లాంగ్ గ్యాప్ తర్వాత రవితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. అందులో సామాజిక కార్యకర్త హేమలత లవణం రోల్ లో ఆమె నటించినా, ఆ సినిమా అనుకున్నంత హిట్ సాధించలేకపోయింది.

కొంత గ్యాప్ తర్వాత రేణు దేశాయ్ ఇప్పుడు మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న 16 రోజుల పండుగ సినిమాలో ఆమె నటిస్తోంది. దీనికి సాయికిరణ్ అడవి దర్శకుడు.

ఈ సినిమాలో ఆమెకు ఎలాంటి రోల్ దక్కుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టిఎన్ఆర్లో మంచి పాత్రే దక్కినా.. నదియా వంటి సీనియర్ నటీమణులు చేస్తున్న పవర్ ఫుల్ రోల్స్ కోసం రేణు ఎదురుచూస్తోందని టాక్.

అందుకే టిఎన్ఆర్ తర్వాత చిన్న విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది. 16 రోజుల పండుగ మూవీలోని రోల్ తనను బాగా నచ్చడంతోనే ఆమె ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

మరి ఈ కొత్త సినిమాలో రేణు దేశాయ్ పాత్ర ఎలా ఉంటుంది? ఎలాంటి హిట్ అందుకుంటుందో.. ఆడియన్స్ ను ఎంతలా మెప్పిస్తుందో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular