
టాలీవుడ్ టాప్ హీరోయిన్ల మధ్య పోటీ సహజం. కానీ, ప్రస్తుత తరం స్టార్లయిన రష్మిక మందన్న, శ్రీలీల మాత్రం అందుకు భిన్నంగా, మంచి స్నేహబంధాన్ని పంచుకుంటున్నారు. తాజాగా వీరిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అభిమానులకు కన్నుల పండుగ చేశారు.
నవంబర్ 7న విడుదల కానున్న తన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా ప్రమోషన్లలో రష్మిక బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా ‘మాస్ పిల్ల’ శ్రీలీల కూడా పాలుపంచుకుంది. శ్రీలీల స్వయంగా రష్మికను ఇంటర్వ్యూ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఎంతో సరదాగా, తెలుగులో ముచ్చటించుకుంటున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరూ కర్ణాటక మూలాలు కలిగి ఉండటం, తెలుగులో టాప్ స్టార్స్‌గా రాణించడం వీరి మధ్య మంచి బంధానికి కారణమై ఉండొచ్చు.
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తున్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సమర్పిస్తుండటంతో సినిమాపై మంచి బజ్ ఉంది. ఈ సమయంలో, ‘మాస్ జాతర’తో హిట్ అందుకున్న శ్రీలీల కూడా ప్రమోషన్లలో భాగం కావడం సినిమాకు మరింత ప్లస్ అయింది.
బిజీ షెడ్యూల్‌లో ఉన్నా, తన తోటి నటి సినిమా కోసం శ్రీలీల సమయం కేటాయించడం అందరినీ ఆకట్టుకుంటోంది. వీరిద్దరూ భవిష్యత్తులో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
