Monday, June 8, 2026
HomeMovie Newsచరణ్, సుకుమార్ మూవీ.. దుబాయ్‌లో స్క్రిప్ట్ చర్చలు పూర్తి!

చరణ్, సుకుమార్ మూవీ.. దుబాయ్‌లో స్క్రిప్ట్ చర్చలు పూర్తి!

ram-charan-sukumar-next-movie-dubai-script-work-updates-rangasthalam

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందనుంది. వీరిద్దరూ కలిసి చేసిన రంగస్థలం బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించింది. దీంతో ఈ కొత్త సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం సుకుమార్ చరణ్ మూవీ స్క్రిప్ట్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ చివరి దశకు చేరుకుందని తెలుస్తుండగా, రీసెంట్‌గా సుకుమార్ రామ్ చరణ్ దుబాయ్‌లో కలిశారు.

దుబాయ్‌లో ఇద్దరూ కలిసి స్క్రిప్ట్‌పై క్లియర్‌గా చర్చించుకున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సుకుమార్ అండ్ టీమ్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తవ్వనుందని సమాచారం.

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని రవిశంకర్ యలమంచిలి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై సుకుమార్ కూడా నిర్మాణంలో భాగస్వామిగా ఉండనున్నారు.

చరణ్ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చి బాబు సానా దర్శకత్వంలో పెద్ది మూవీతో బిజీగా ఉన్నారు. ఆ మూవీ పనులు అన్నీ కంప్లీట్ అయ్యాక.. 2026లో చరణ్ సుకుమార్ మూవీ సెట్స్ లోకి అడుగు పెట్టనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular