Monday, May 18, 2026
HomeMovie Newsరజినీ కోసం రూ.10 కోట్లు.. యంగ్ డైరెక్టర్‌కు కమల్ హాసన్ బంపర్ ఆఫర్!

రజినీ కోసం రూ.10 కోట్లు.. యంగ్ డైరెక్టర్‌కు కమల్ హాసన్ బంపర్ ఆఫర్!

rajinikanth-kamal-haasan-thalaivar173-ram-kumar-balakrishnan-remuneration

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, విశ్వనటుడు కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కబోయే (Thalaivar173) ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇండస్ట్రీలోనే అరుదైన ఈ కాంబినేషన్‌కు సంబంధించిన దర్శకుడి వేట ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

వాస్తవానికి, ఈ క్రేజీ ప్రాజెక్టుకు మొదట్లో సి. సుందర్‌ను దర్శకుడిగా ప్రకటించారు. కానీ ఆయన అనుకోని పరిస్థితులు కారణంగా ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. దీనిపై ఆయన క్షమాపణలు చెబుతూ లేఖ విడుదల చేశారు.

సుందర్ తప్పుకున్న తర్వాత లోకేష్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజ్ పేర్లు వినిపించాయి. కానీ రీసెంట్‌గా పార్కింగ్ మూవీ ఫేమ్ రామ్ కుమార్ బాలకృష్ణన్ పేరు ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది.

రామ్‌ కుమార్ బాలకృష్ణన్ నెరేట్ చేసిన స్టోరీ రజినీకి కమల్‌కు నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ యంగ్ డైరెక్టర్ రెమ్యూనరేషన్ ఇప్పుడు సంచలనంగా మారింది.

పార్కింగ్ సినిమాకు కేవలం రూ.6 లక్షలు తీసుకున్న రామ్ కుమార్ బాలకృష్ణన్, ఇప్పుడు రజినీ-కమల్ మూవీకి ఏకంగా రూ.10 కోట్లు అందుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. రెండేళ్లలో ఆయన రెమ్యూనరేషన్ రేంజ్ అమాంతం పెరిగింది.

తక్కువ టైమ్ లోనే ఇంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకోనుండడం గమనార్హం. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular