
రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దర్శకుడు దేవా కట్టా ఇటీవల వారణాసికథపై చేసిన వ్యాఖ్యలు ఆ అంచనాలను మరింత పెంచాయి. కథ వినగానే తన మైండ్ బ్లాక్ అయ్యిందని, ఇది మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలను మించిన షాక్ ఇస్తుందని ఆయన చెప్పారు.
దేవా కట్టా ప్రస్తావించిన మగధీర, ఈగ చిత్రాల మాదిరిగానే వారణాసి కూడా బలమైన ఎమోషన్ కాల సిద్ధాంతంతో ముడిపడి ఉంటుంది. గ్లింప్స్‌లో చూపించిన 512 CE, 2027 CE కాలమానాలను చూస్తే, జక్కన్న మరోసారి ‘కాలం కర్మ’ అంశాలను తీసుకున్నారని అర్థమవుతోంది.
బాహుబలి తరహాలో భారీ విజువల్స్ యుద్ధం ఇందులో ఉంటాయి. ‘లంకా’, ‘త్రేతాయుగం’ వంటి రిఫరెన్సులను బట్టి.. మోడరన్ టెక్నాలజీకి పురాతన శక్తికి మధ్య పోరాటం ఉండే ఛాన్స్ ఉంది.
ఆర్ఆర్ఆర్ లో ఇద్దరు హీరోల మధ్య ఉన్న బంధంలాగే, మహేష్ పాత్ర ‘రుద్ర’ జర్నీలోనూ బలమైన ఎమోషన్ ఉంటుందని కట్టా మాటల ద్వారా తెలుస్తోంది. గుండెను తాకే ఒక బలమైన భావోద్వేగ కథ అని స్పష్టమవుతోంది.
రాజమౌళి తన కెరీర్ ప్రయోగాలన్నింటినీ కలిపి ఈ సినిమా కోసం ఒక యూనివర్సల్ సబ్జెక్ట్‌ను రెడీ చేశారు. మహేష్‌ను గ్లోబల్ ట్రాటర్ గా చూపిస్తూనే, మన ఇతిహాసాల లోతును ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నంలా ఇది కనిపిస్తోంది.
