Sunday, October 4, 2026
HomeMovie Newsకాబోయే భార్య కోసం రాహుల్ సిప్లిగంజ్ మాస్టర్ ప్లాన్

కాబోయే భార్య కోసం రాహుల్ సిప్లిగంజ్ మాస్టర్ ప్లాన్

rahul-sipligunj-harinya-reddy-sangeet-surprise-yuzvendra-chahal

టాలీవుడ్ స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి వేడుకల్లో భాగంగా తాజాగా సంగీత్ ఈవెంట్ జరిగింది. ఈ నెల 27న హరిణ్యా రెడ్డితో రాహుల్ వివాహం జరగనున్న నేపథ్యంలో, సంగీత్ వేదికపై రాహుల్ ఇచ్చిన ఒక సర్‌ప్రైజ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

హరిణ్యా రెడ్డి టీమ్ ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు పిచ్చి అభిమాని. ఈ విషయం తెలిసిన రాహుల్, చాహల్‌ను సంగీత్ ఈవెంట్‌కు ప్రత్యేకంగా ఆహ్వానించాడు.

చాహల్ ఆ ఈవెంట్‌కు హాజరవడంతో హరిణ్య ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తన అభిమాన క్రికెటర్ స్వయంగా వచ్చి వేడుకలో పాల్గొనడం చూసి హరిణ్య భావోద్వేగానికి గురయ్యారు.

ఈ విషయాన్ని హరిణ్య సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఇంత పెద్ద గిఫ్ట్ తన లైఫ్‌లో మర్చిపోలేనని, థాంక్యూ రాహుల్ అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం వారిద్దరూ చాహల్‌తో కలిసి దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

నవంబర్ 27న ఉదయం 5 గంటలకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఓ లగ్జరీ ప్యాలెస్‌లో రాహుల్-హరిణ్యల పెళ్లి జరగనుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular