
స్టార్ హీరో ప్రభాస్ తన అభిమానులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. బాహుబలి, సాహో లాంటి సినిమాల కోసం ఎక్కువ సమయం తీసుకున్న ప్రభాస్, ఇకపై సంవత్సరానికి కనీసం ఒకటి లేదా రెండు సినిమాలు ఉండేలా చూసుకుంటానని మాటిచ్చారు.
అనుమానాలు ఉన్నా, ప్రభాస్ ఆ మాటపై నిలబడి సినిమాలను వేగంగా పూర్తి చేస్తున్నారు. ఆ క్రమంలోనే, ఈ ఏడాది రాజా సాబ్ విడుదల కాకపోయినా, వచ్చే ఏడాది మాత్రం ప్రభాస్ నుంచి రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్టులలో రాజా సాబ్ మొదట రిలీజ్ కానుంది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అయింది.
హారర్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న రాజా సాబ్ ఇప్పుడు సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుందని మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. రాజా సాబ్ సినిమాలోని పెండింగ్ సాంగ్స్ షూట్ కోసం ప్రభాస్ ప్రస్తుతం గ్రీస్ వెళ్లారు. ఆ షూటింగ్ పూర్తి అయితే ఈ సినిమా దాదాపు పూర్తయినట్టే.
ఇక ఫౌజీ సినిమా విషయానికి వస్తే, రాజా సాబ్ షూటింగ్ చేస్తూనే ప్రభాస్ ఈ సినిమాను కూడా సమాంతరంగా పూర్తి చేస్తున్నారు. హను రాఘవపూడి ఈ సినిమా షూటింగ్‌ను వేగంగా జరుపుతున్నారు.
ఫౌజీ సినిమా షూటింగ్‌లో కేవలం 25 రోజుల టాకీ పార్ట్ మరియు ఫైట్ సీన్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయనే ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటికి వచ్చింది. మిగిలినదంతా పూర్తయినట్టే. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్ నెలలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
