
‘బాహుబలి’ నుంచి ‘సలార్’ వరకు సీరియస్ రోల్స్ చూసిన ఫ్యాన్స్.. పాత డార్లింగ్ ఎనర్జీని మిస్ అయ్యారు. అందుకే మారుతి డైరెక్షన్లో ‘ది రాజా సాబ్‘ సినిమాతో వారి కోరిక తీర్చడానికి ప్రభాస్ సిద్ధమయ్యాడు.
‘రాజా సాబ్’ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని టాక్. ఆయన తన సీరియస్ మోడ్ నుంచి కామెడీకి షిఫ్ట్ అయ్యారు. ప్రభాస్ టైమింగ్, ఎంటర్టైనింగ్ పర్ఫార్మెన్స్ కారణంగా ఫ్యాన్స్ రిపీటెడ్ ఫుట్ ఫాల్స్ పడేలా ఉంటాయని అంటున్నారు.
యాక్షన్ సీన్స్ కాకుండా, ఎంటర్టైనింగ్ సీన్స్ లోని ప్రభాస్ పెర్ఫార్మెన్స్ ను ఫ్యాన్స్ సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ వంటి అందమైన భామలు కూడా ఈ సినిమాకు మరింత గ్లామర్, ఎనర్జీ తెస్తున్నారు.
ఈ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సంగీతం విషయంలో కూడా అంచనాలను పెంచుతోంది. ఈ హారర్-కామెడీ సినిమా ప్రభాస్ బాక్సాఫీస్ మార్క్ చూపించడం ఖాయమని అంటున్నారు.
‘రాజా సాబ్’ తర్వాత ప్రభాస్ హను రాఘవపూడి తో ‘ఫౌజీ’, సందీప్ వంగతో ‘స్పిరిట్’ సినిమాలు చేయనున్నారు. అందుకే ఈ సినిమాలు మొదలయ్యే ముందు ఫ్యాన్స్‌కు పాత ప్రభాస్‌ను చూపించడం ఈ సినిమా ఉద్దేశం.
