Wednesday, June 10, 2026
HomeMovie Newsతలకు చుట్టిన క్లాత్ తీసిన ప్రభాస్.. వైరల్ అవుతున్న కొత్త లుక్!

తలకు చుట్టిన క్లాత్ తీసిన ప్రభాస్.. వైరల్ అవుతున్న కొత్త లుక్!

పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉంది. ‘రాజా సాబ్’ విడుదలకు సిద్ధమవుతుండగా, ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘సలార్ 2’ వంటి భారీ చిత్రాలు క్యూలో ఉన్నాయి. అయితే, గత కొంతకాలంగా ప్రభాస్ ఎక్కడ కనిపించినా, తన హెయిర్‌స్టైల్‌ను ఓ క్లాత్‌తో కవర్ చేస్తూ వస్తున్నారు. ఇది ‘ఫౌజీ’ లుక్ లీక్ కాకూడదనే ప్రచారం జరిగింది.

అయితే, చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఆ ‘మిస్టరీ’ లుక్‌కు బ్రేక్ ఇచ్చారు. తాజాగా టాలీవుడ్ నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్ ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ పార్టీకి ఆయన హాజరయ్యారు. ఈ పార్టీలో ఆయన తలకు ఎలాంటి క్లాత్ లేకుండా, సరికొత్త హెయిర్‌స్టైల్‌తో కనిపించారు.

ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రభాస్ న్యూ లుక్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ లుక్ చాలా ఫ్రెష్‌గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ప్రైవేట్ పార్టీలో ప్రభాస్‌తో పాటు యాక్టర్ సుబ్బరాజు, ఏపీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మ కూడా పాల్గొన్నారు.

ప్రభాస్ ఈ కొత్త లుక్‌ను ఏ సినిమా కోసం మెయింటెయిన్ చేస్తున్నారనే దానిపై ఇప్పుడు ఫ్యాన్స్‌లో చర్చ మొదలైంది. ఇది హను రాఘవపూడి ‘ఫౌజీ’ కోసమా? లేక సందీప్ వంగా ‘స్పిరిట్’ కోసమా? అని వారు డిస్కషన్స్ పెట్టుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular