
టాలీవుడ్ హీరోల క్రేజ్ ఇప్పుడు ఖండాంతరాలు దాటింది. ముఖ్యంగా జపాన్‌లో మన స్టార్లకు వీరాభిమానులు ఉన్నారు. ఎన్టీఆర్, చరణ్‌లతో పాటు రెబల్ స్టార్ ప్రభాస్ అంటే అక్కడి జనాలకు పిచ్చి ప్రేమ. మన హీరోలు ఎక్కడికి వెళ్తే అక్కడికి వాలిపోయేంత అభిమానం వారిది. ఆ ప్రేమకు ఫిదా అయిన డార్లింగ్ ఇప్పుడు జపాన్ వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.
పాన్ వరల్డ్ మూవీ ‘కల్కి 2898 AD’ జపాన్‌లో రిలీజై భారీ విజయం సాధించింది. అయితే సినిమా ప్రమోషన్ టైమ్‌లో ఇండియాలో బిజీగా ఉండి వెళ్లలేకపోయిన ప్రభాస్, ఇప్పుడు ఆ లోటు తీర్చబోతున్నారు. ఆ సినిమాను ఆదరించిన ఫ్యాన్స్‌కు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పడానికే డిసెంబర్‌లో జపాన్ ఫ్లైట్ ఎక్కబోతున్నారు.
ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ (Fauji) షూటింగ్‌లో ప్రభాస్ బిజీగా ఉన్నారు. కీలక షెడ్యూల్స్ ఉన్నప్పటికీ, జపాన్ అభిమానుల కోసం షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చి మరీ ఈ ట్రిప్ ప్లాన్ చేశారు. ఇది నిజంగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.
జపాన్ నుంచి రాగానే సందీప్ రెడ్డి వంగాతో చేయబోయే ‘స్పిరిట్’ సినిమాను పట్టాలెక్కించే ప్లాన్‌లో ఉన్నారు. అలాగే మారుతి డైరెక్షన్‌లో వస్తున్న ‘ది రాజా సాబ్’ సంక్రాంతికి రిలీజ్ కానుండటంతో, ఆ ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ పాల్గొనబోతున్నారు.
ఒకపక్క షూటింగ్స్, మరోపక్క ప్రమోషన్స్, మధ్యలో ఇలా ఫారిన్ ట్రిప్స్.. మొత్తానికి డార్లింగ్ షెడ్యూల్ ఇప్పుడు ఫుల్ ప్యాక్డ్. ఏదేమైనా ఫ్యాన్స్ కోసం ప్రభాస్ తీసుకుంటున్న ఈ చొరవ చూసి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
