
రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్య ఎక్కడ కనిపించినా, ఆయన తలకు క్లాత్ చుట్టి దర్శనమిస్తున్నారు. ఇటీవల ‘బాహుబలి: ది ఎపిక్’ ఇంటర్వ్యూలోనూ ఇదే లుక్‌లో కనిపించడంతో, ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ప్రభాస్ తన హెయిర్‌స్టైల్‌ను ఎందుకు దాస్తున్నాడనేది మిస్టరీగా మారింది.
ఈ లుక్‌పై రకరకాల గాసిప్స్ వస్తున్నాయి. కొందరు హెయిర్ ట్రీట్‌మెంట్ అని ప్రచారం చేస్తున్నా, అసలు కారణం అది కాకపోవచ్చు. ‘పుష్ప’ కోసం బన్నీ, ‘RRR’ కోసం చరణ్, తారక్ చేసినట్లే.. ప్రభాస్ కూడా తన తదుపరి సినిమా లుక్ లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నారని బలంగా వినిపిస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ లైనప్‌లో ‘స్పిరిట్’, ‘ఫౌజీ’ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ చిత్రాల దర్శకులు సందీప్ వంగా, హను రాఘవపూడి లుక్స్ విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. వారి రిక్వెస్ట్ మేరకే ప్రభాస్ ఈ జాగ్రత్త తీసుకుంటున్నారని సమాచారం.
అయితే, ఈ ‘హెడ్ ర్యాప్’ వెనుక ఉన్న అసలు కారణం ‘ఫౌజీ’ అని గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఇది పీరియడ్ యాక్షన్ డ్రామా కావడంతో, ఇందులో ప్రభాస్ పలు విభిన్న లుక్స్‌లో కనిపిస్తారట. ప్రస్తుతం ఆయన ఈ సినిమా షూటింగ్‌లోనే ఉన్నారు.
‘ఫౌజీ’ షూటింగ్ మధ్యలోనే ‘బాహుబలి’ ప్రమోషన్లకు రావాల్సి రావడంతో, ఆ స్పెషల్ లుక్ లీక్ కాకూడదనే ఉద్దేశంతోనే దర్శకుడు హను రాఘవపూడి రిక్వెస్ట్ మేరకు ప్రభాస్ ఇలా తలకు క్లాత్ చుట్టారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
