
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న “విశ్వంభర” సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ మౌని రాయ్ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా మౌని రాయ్ తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో చిరంజీవితో కలిసి ఉన్న కొన్ని ఫొటోలు పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకుంది.
ఈ ప్రత్యేక పాట షూటింగ్‌కు సంబంధించిన అనుభూతులు మౌని రాయ్ స్పష్టంగా తెలియజేశారు. “విశ్వంభర” సెట్స్‌లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి డాన్స్ చేయడం తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన సందర్భమని చెప్పింది. చిరుతో కలిసి పనిచేయడం ఆనందంగా, గర్వంగా అనిపించిందని చెప్పింది.
డాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్య, ఇతర టీం మెంబర్స్‌కు కూడా మౌని రాయ్ ధన్యవాదాలు తెలిపింది. ఈ క్రేజీ పోస్ట్‌తో విశ్వంభర స్పెషల్ సాంగ్‌పై ఆసక్తి మరింత పెరిగింది. అభిమానులు కూడా ఈ సాంగ్ ఎలా ఉండబోతోందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం “విశ్వంభర” షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే ఈ స్పెషల్ సాంగ్‌కు సంబంధించిన అధికారిక అప్డేట్ రావొచ్చని టాక్ నడుస్తోంది.
