
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జోడీగా వస్తున్న “పెద్ది” మూవీపై ఇప్పటికే మంచి హైప్ ఉంది. బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ సినిమాకు ఆస్కార్ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఫ్యాన్స్ ఆడియో అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం, పెద్ది ఫస్ట్ సింగిల్ విడుదల తేదీ లాక్ చేసినట్లు సమాచారం.
వచ్చే ఆగస్ట్‌లో జరిగే వినాయక చవితి సందర్భంగా ఈ పాటను విడుదల చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. మ్యూజికల్ ట్రీట్‌పై ఇదే నిజమా అనేది అధికారికంగా వెల్లడి కావాలి.
దివ్యేందు శర్మ, శివ రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ భారీ సినిమా వచ్చే ఏడాది మార్చ్ 27న విడుదల కానుంది.
