Monday, April 13, 2026
HomeAndhra Pradeshపవన్ కల్యాణ్ చొరవకు లోకేశ్ ప్రశంస: ట్వీట్‌తో అభినందన

పవన్ కల్యాణ్ చొరవకు లోకేశ్ ప్రశంస: ట్వీట్‌తో అభినందన

pawan-kalyan-kumki-help-lokesh-response

ఏపీ: ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతుల సమస్యపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీసుకున్న కీలక నిర్ణయాన్ని మంత్రి నారా లోకేశ్ అభినందించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన, “వపనన్నకు శుభాభినందనలు” అంటూ పవన్ చొరవపై ప్రశంసలు కురిపించారు.

ఏనుగుల విధ్వంసంతో రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను తీసుకొచ్చిన ఉప ముఖ్యమంత్రికి, వెంటనే స్పందించిన కర్ణాటక ప్రభుత్వానికి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు.

యువగళం పాదయాత్రలో చిత్తూరు జిల్లాలో రైతులు తమ బాధను తనతో పంచుకున్నారని గుర్తుచేశారు. అప్పటినుంచి సమస్యపై చర్యలు అవసరమన్న ఆవశ్యకతపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ అడుగుతో కర్ణాటక ప్రభుత్వం నాలుగు కుంకీ ఏనుగులను అందించడాన్ని రైతుల గుండె గెలిచే నిర్ణయంగా అభివర్ణించారు. ఇది ప్రభుత్వాల మధ్య సమన్వయంతో సాధ్యమైన మంచి పరిష్కారంగా కొనియాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular