
న్యూస్ డెస్క్: పాకిస్థాన్ ఇప్పుడు దరిద్రానికి ప్రతీకగా మారిందని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక స్పష్టం చేసింది. ఆ దేశంలో పేదరికం చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరిందని, గత ఎనిమిదేళ్లలో పరిస్థితి మరింత దిగజారిందని తెలిపింది.
పేదరికం కేవలం ఆర్థిక సమస్య కాదు, సామాజిక సంక్షోభంగా మారిందని ప్రపంచ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం పాకిస్థాన్ జనాభాలో దాదాపు 43 శాతం మంది జీవనాధారం కోసం పోరాడుతున్నారు.
ఐఎంఎఫ్ నుంచి రుణాలు తీసుకుంటున్నా వాటిని అభివృద్ధి కార్యక్రమాలకంటే రక్షణ ఖర్చులకు వినియోగించడం పేదరికాన్ని మరింత పెంచిందని నివేదిక పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని, రైతులు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది.
2023 నుంచి ఇప్పటి వరకు పేదరికం ఏడు శాతం పెరిగిందని, ప్రభుత్వ నిర్లక్ష్యం దీనికి ప్రధాన కారణమని ప్రపంచ బ్యాంక్ తేల్చింది. పాక్ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండడంతో దేశం ఆర్థిక పతన అంచుల్లో ఉందని హెచ్చరించింది.
రక్షణ రంగంలో పెట్టుబడులు పెంచుతూ ప్రజల అవసరాలను పక్కన పెడితే, ప్రజలే తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. భారత్‌పై ద్వేషం చూపే ముందు తమ దేశాన్ని రక్షించుకోవాలని ఆ దేశానికి సూచిస్తున్నారు.
