
ప్రతి వారం మాదిరిగానే, ఈ వీకెండ్‌లోనూ ఓటీటీ ప్రేక్షకులు పండుగ చేసుకునే స్థాయిలో కొత్త కంటెంట్ అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు కలిపి ఈ వారం దాదాపు 20 నుంచి 25 కొత్త టైటిల్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఈ వారం అత్యధికంగా ఎదురుచూసిన సిరీస్ – ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 3. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ మునుపటి సీజన్ల మాదిరిగానే ఆకట్టుకుంటుందని ప్రేక్షకులు అంటున్నారు. మరోవైపు వివేక్ అగ్నిహోత్రి వివాదాస్పద చిత్రం ‘ది బెంగాల్ ఫైల్స్’ జీ5లో రిలీజ్ అయ్యింది.
సౌత్ స్టార్స్ కూడా తమ కంటెంట్‌ను రిలీజ్ చేశారు. విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ నటించిన ‘బైసన్’ నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే, విజయ్ సేతుపతి తనయుడు సూర్య సేతుపతి నటించిన వెబ్ సిరీస్ ‘నాడు సెంటర్’ కూడా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
వీటితో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో ‘జురాసిక్ వరల్డ్ : సీజన్ 4’, ‘డైనింగ్ విత్ ది కపూర్స్’ షోలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అమెజాన్ ప్రైమ్‌లో ‘డ్రీమ్ ఈటర్’, ‘స్టిచ్ హెడ్’ వంటి ఇంగ్లీష్ చిత్రాలు అందుబాటులోకి వచ్చాయి. తెలుగు సినిమా ‘కర్మణే వాధికారస్తే’ కూడా సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ మొదలైంది.
ఇలా భాషతో ప్రమేయం లేకుండా, ఈ వీకెండ్‌లో ఓటీటీ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లభించాయి. కనుక ఈ వారం ఫుల్ కంటెంట్‌తో ఎంజాయ్ చేయవచ్చు.
