
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ స్వయంభూ మూవీతో బిజీగా ఉన్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమా 8 భాషల్లో రిలీజ్ కానుంది. దీనిపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.
భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 13, 2026న సినిమా విడుదల చేయనున్నారు.
ఇప్పుడు నిఖిల్ కు పోటీగా యంగ్ హీరో అఖిల్ రానున్నట్లు తెలుస్తోంది. అఖిల్ ప్రస్తుతం మురళీకృష్ణ అబ్బురు దర్శకత్వంలో మాస్ ఎంటర్టైనర్ లెనిన్ మూవీ చేస్తున్నాడు.
ఈ సినిమాను 2026 ఫిబ్రవరి 14న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందు రోజు స్వయంభు రానుండగా, తర్వాత రోజు లెనిన్ విడుదల కానుంది. బాక్సాఫీస్ వద్ద శివరాత్రికి నిఖిల్ అఖిల్ పోటీ పడనున్నారు.
లెనిన్ హీరోయిన్ విషయంలో కొంత మార్పు జరిగింది. మొదట శ్రీలీలను ఫిక్స్ చేసినా, కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకోవడంతో భాగ్యశ్రీ బొర్సేను హీరోయిన్ గా తీసుకున్నారు.
