
న్యూస్ డెస్క్: సముద్ర గర్భం అనగానే మనకు గుర్తొచ్చేది రహస్యాలు, అన్వేషించని జీవరాశులు. తాజాగా జపాన్ తీర సముద్రాల్లో ఒక కొత్త పరాన్నజీవిని కేరళకు చెందిన యువ శాస్త్రవేత్త డాక్టర్ పీటీ అనీశ్ కనుగొన్నారు. ఇది కోపి పాడ్ జాతికి చెందిన జీవి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇది లోతు సముద్ర చేప క్లోరోఫ్తాల్మస్ ఆల్బట్రాసిస్ నోటిలో పెరుగుతుంది.
ఈ కనుగొనడం సముద్ర జీవ వైవిధ్యానికి కొత్త అధ్యాయం. ఒకే చేపలో నాలుగు లేదా ఐదు రకాల పరాన్నజీవులు ఉండగలవని ఆయన పరిశోధన నిరూపించింది. వీటి ప్రభావం మత్స్యకారులపై, చేపల పెంపక పరిశ్రమపై తీవ్ర ఆర్థిక ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మానవులకు ఈ జీవి నేరుగా ప్రమాదం కలిగించే అవకాశం లేదు. కానీ చేపల పరిశ్రమపై దాని ప్రభావం పరోక్షంగా మన ఆహార భద్రతకు ముప్పు తెచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ పరిశోధనలు ఎంతో కీలకం.
ప్రస్తుతం డాక్టర్ అనీశ్ మలేసియాలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన బృందం ఇప్పటివరకు 42 రకాల కొత్త పరాన్నజీవులను గుర్తించింది. ఇది భారతీయ శాస్త్రవేత్తలకు గర్వకారణం.
సముద్ర గర్భంలోని ఇంకా అనేక జీవరహస్యాలు అన్వేషణ కోసం ఎదురుచూస్తున్నాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఇలాంటి పరిశోధనలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భవిష్యత్తులో ఆహార భద్రత, పర్యావరణ సమతుల్యత కోసం ఇవి కీలకం.
ఇదంతా చూస్తే కొత్త పరాన్నజీవి కనుగొనడం ఒక శాస్త్రీయ విజయం మాత్రమే కాదు, భవిష్యత్తు సమాజానికి కూడా ఒక హెచ్చరిక.
