
తెలుగు సినిమాలపై నెట్‌ఫ్లిక్స్ దృష్టి మరింతగా పెరిగింది. ఈ ఏడాది తొలి భాగంలో ‘డాకు మహారాజ్’, ‘తండేల్’, ‘కోర్ట్’ వంటి విజయవంతమైన చిత్రాలను స్ట్రీమింగ్ చేసిన నెట్‌ఫ్లిక్స్, ఇప్పుడు మరిన్ని పెద్ద సినిమాల హక్కులు దక్కించుకుంటోంది.
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ సినిమాను సెప్టెంబర్ 25న విడుదల చేయనుండగా, నవంబర్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. డిజిటల్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసింది.
విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ సినిమా జూలై 31న విడుదల కానుంది. సెప్టెంబర్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. గతంలో ‘డాకు మహారాజ్’, ‘లక్కీ భాస్కర్’ సినిమాల హక్కులు కూడ నెట్‌ఫ్లిక్స్‌కే దక్కాయి.
రవితేజ నటించిన ‘మాస్ జాతర’ ఆగస్టు 27న థియేటర్లకు రానుంది. అక్టోబర్‌లో ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ సినిమా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. విడుదల తేదీ ప్రకటించకపోయినా, డిజిటల్ హక్కులు ముందుగానే తీసుకుంది.
ఇవి కాకుండా బాలకృష్ణ ‘అఖండ 2’, ప్రభాస్ ‘రాజా సాబ్’ సినిమాల హక్కుల కోసం చర్చలు సాగుతున్నట్లు సమాచారం.