
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ది ప్యారడైస్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాకముందే, మరో యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తన తదుపరి ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేయబోతున్నాడు. దసరా పర్వదినం సందర్భంగా ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు జరగనున్నాయి.
ఇప్పటికే నాని ఈ కథను ఓకే చేసినట్లు సమాచారం. ఇందులో ఆయన పవర్‌ఫుల్ రోల్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ కొత్త సినిమా గురించి క్రేజీ అప్‌డేట్ ఒక్కటే కాదు, విలన్‌గా ఎవరు కనిపించబోతారన్న చర్చ కూడా హాట్ టాపిక్‌గా మారింది.
మలయాళ నటుడు డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో విలన్‌గా నటించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఆయన గతంలో సలార్ సినిమాలో ఇంపాక్ట్ చూపించగా, ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి SSMB29లో కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.
పృథ్వీరాజ్ విలన్‌గా ఎంట్రీ ఇస్తే నాని సుజీత్ కాంబోకు కొత్త హైప్ వస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవెల్‌లో ఉండటంతో, ఈ సినిమాలో ఏ రేంజ్‌లో కనెక్ట్ అవుతాడో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే, ఈ వార్తలపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. పూజా కార్యక్రమాల తర్వాత పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు.
