
భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుని, అమెరికాకు గట్టి షాక్ ఇచ్చేలా స్కెచ్ వేశారు.
ఇంధన వాణిజ్యం:
పశ్చిమ దేశాల నుంచి ఒత్తిడులు ఉన్నప్పటికీ, భారత్ రష్యా ఇంధన సరఫరా నిరాటంకంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. భారత్ రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం 12 శాతం పెరిగి రికార్డు సృష్టించిందని పుతిన్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. 2030 నాటికి వాణిజ్యం 100 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
డాలర్‌కు చెక్:
అమెరికన్ డాలర్‌పై ఆధారపడకుండా క్రమంగా చెల్లింపుల కోసం తమ జాతీయ కరెన్సీలను ఉపయోగించే దిశగా భారత్ రష్యా కదులుతాయని ప్రకటించారు. దాదాపు 96 శాతం వాణిజ్య చెల్లింపులను జాతీయ కరెన్సీల్లోనే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని డాలర్ పెత్తనానికి చెక్ పెట్టారు.
ఉగ్రవాదంపై ఏకం:
ఉగ్రవాదంపై పోరుకు ఇరు దేశాలు కలిసి నడుస్తాయని మోదీ స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడికి గత ఏడాది రష్యాలోని మాస్కోలో జరిగిన దాడికి మూలం ఉగ్రవాదమేనని, దానిపై ప్రత్యక్ష దాడులకు భారత్ రష్యా ఏకమైనట్టు ప్రకటించారు.
ఉక్రెయిన్ పై స్పందన:
ఉక్రెయిన్ యుద్ధంపై తాము ఏ పక్షం వహించమని, శాంతిపక్షాన నిలుస్తామని మోడీ స్పష్టం చేశారు. చర్చలు శాంతియుతంగానే ఉక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం తీసుకోవాలని భారత్ తరుపున మోడీ ఆకాంక్షించారు.
