
న్యూస్ డెస్క్: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి లిక్కర్ స్కామ్ కేసులో పెద్ద ఊరట లభించింది. విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు ఈరోజు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
కోర్టు ఆదేశాల ప్రకారం వారంలో రెండు రోజుల పాటు సిట్ విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. అలాగే రెండు షూరిటీలు, రూ.2 లక్షల పూచికత్తు సమర్పించాలని పేర్కొంది.
విదేశాలకు కోర్టు అనుమతి లేకుండా వెళ్లరాదని, సాక్షులను బెదిరించరాదని, సహనిందితులతో కేసు విషయాలు మాట్లాడరాదని కోర్టు కఠినంగా తెలిపింది. వాట్సాప్ నంబర్, ఆధార్, ఈమెయిల్ వివరాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది.
జులై 20న మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. దాదాపు 71 రోజుల తర్వాత ఆయనకు బెయిల్ లభించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అన్ని లీగల్ ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత రేపు ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. ఇదే కేసులో మరో ముగ్గురు నిందితులు ఇప్పటికే బెయిల్ పొందారు.
ఈ పరిణామంతో మిథున్ రెడ్డి తన రాజకీయ కార్యక్రమాలను త్వరలోనే మళ్లీ ప్రారంభించే అవకాశం ఉంది.
