
రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో వస్తున్న 75వ చిత్రం ‘మాస్ జాతర’పై భారీ అంచనాలు ఉన్నాయి. ‘మనదే ఇదంతా’ అనేది ఉపశీర్షికగా వస్తున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఆగస్టు 27న విడుదలకు సిద్ధమైన ఈ సినిమాకు తాజాగా టీజర్ రిలీజ్ అయింది.
టీజర్‌లో రవితేజ పోలీస్ పాత్రలో ‘నాకంటూ ఓ చరిత్ర ఉంది..’ అంటూ చెప్పిన డైలాగ్ మాస్ ఫీలింగ్‌ను పంచింది. యాక్షన్, స్టైల్ కలగలిపిన ఆయన లుక్ అభిమానులను ఆకట్టుకుంది. రవితేజ తన ఎనర్జీతోనే టీజర్‌ను మోసేశాడని చెప్పొచ్చు.
చిన్న షాట్స్, శార్ప్ కట్స్, బిగ్ స్కేల్ విజువల్స్ టీజర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా యాక్షన్‌ను హైలైట్ చేస్తూ మాస్ వైబ్ తీసుకొచ్చింది. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో టీజర్‌పై పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు.
దర్శకుడు భాను భోగవరపు ఈ సినిమాను పూర్తిగా మాస్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించినట్టు టీజర్ సూచిస్తోంది. రవితేజకు సరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లు, స్టైలిష్ ఫ్రేమ్స్ ప్రేక్షకుల అంచనాలను పెంచుతున్నాయి.
ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీకి మంచి బజ్ ఏర్పడింది. విడుదలకు ఇంకా కొన్ని వారాలే ఉండటంతో ప్రమోషన్లు వేగవంతమవుతున్నాయి.