Tuesday, May 12, 2026
HomeMovie News'కన్నప్ప' తర్వాత విష్ణు స్ట్రాటజీ.. శ్రీను వైట్ల సినిమా ఏమైంది?

‘కన్నప్ప’ తర్వాత విష్ణు స్ట్రాటజీ.. శ్రీను వైట్ల సినిమా ఏమైంది?

manchu-vishnu-next-movie-search-dhee-sequel-status-mohan-babu-comeback

చాలా రోజుల తర్వాత మంచు విష్ణుకు కన్నప్ప సినిమాతో ప్రేక్షకుల అటెన్షన్ దక్కింది. వరుస ఫ్లాపులతో కెరీర్‌లో వెనకబడ్డా, కన్నప్ప ఇచ్చిన పుష్‌ను వాడుకోవాలని విష్ణు ఇప్పుడు తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టాడు.

తన ఇమేజ్‌కి తగినట్టుగా మంచి కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ కథల కోసం విష్ణు తీవ్రంగా సర్చ్ చేస్తున్నాడట. ఈ టైమ్‌లోనే ఇంకా ఎక్స్‌పరిమెంట్ కథలు చేస్తే కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందని ఆడియన్స్ అంటున్నారు.

అసలైతే శ్రీను వైట్లతో ఢీ సీక్వెల్ చేయాలన్న ఆలోచన ఉన్నా, అది సెట్స్ మీదకు వెళ్లట్లేదు. ఆ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి కూడా పక్కన పెట్టారు. విష్ణు ఇప్పుడు కమర్షియల్‌గా అదరగొట్టే కాంబినేషన్ కోసం చూస్తున్నాడు.

ఇటు మంచు ఫ్యామిలీ నుంచి కూడా మంచి అప్డేట్స్ ఉన్నాయి. మోహన్ బాబు కూడా నాని ది ప్యారడైజ్ లో విలన్‌గా చేస్తున్నారు. మంచు మనోజ్ కూడా భైరవం, మిరాయ్ సినిమాలతో రీ ఎంట్రీ ఇచ్చాడు.

మొన్నటిదాకా ఫ్యామిలీ ఇష్యూస్‌తో హాట్ టాపిక్‌గా ఉన్న మంచు హీరోలు, ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వడం ఫ్యాన్స్‌కు సంతోషాన్ని ఇస్తోంది. మరి విష్ణు ఫైనల్‌గా ఓకే చెప్పే డైరెక్టర్ ఎవరవుతారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular