Friday, June 12, 2026
HomeLife Styleతప్పుడు APK ఫైల్ డౌన్‌లోడ్ అయితే? వెంటనే చేయాల్సిన పనులు!

తప్పుడు APK ఫైల్ డౌన్‌లోడ్ అయితే? వెంటనే చేయాల్సిన పనులు!

malicious-apk-file-installed-immediate-steps-cyber-security-advice

న్యూస్ డెస్క్: సైబర్ నేరగాళ్లు ఎప్పుడూ కొత్త ఎత్తుగడలతో దాడి చేస్తున్నారు. పొరపాటున వారు పంపే మోసపూరిత APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్ స్టాల్ చేసుకుంటే, భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇలాంటి పొరపాటు జరిగినప్పుడు నష్టాన్ని నివారించడానికి వెంటనే చేయాల్సిన కీలక పనులపై సైబర్ నిపుణులు సూచనలు చేస్తున్నారు.

అనుమానాస్పద APK ఫైల్ ఇన్ స్టాల్ అయిన వెంటనే, యుద్ధ ప్రాతిపదికన నష్ట నివారణ చర్యలు చేపట్టాలి. మొట్టమొదటగా చేయాల్సింది వెంటనే ఇంటర్నెట్ డేటాను ఆపివేయడం వైఫైను డిసేబుల్ చేయడం. ఇది హ్యాకర్ కంట్రోల్‌ను నిలిపివేస్తుంది.

ఆ తర్వాత, ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్స్ విభాగంలో సదరు APK యాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేయాలి. మాల్‌వేర్ యాప్ అన్ ఇన్‌స్టాల్ కాకుంటే, వెంటనే ఫోన్‌ను ‘సేఫ్ మోడ్’ లో రీస్టార్ట్ చేసి దాన్ని తొలగించాలి.

యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌తో ఫోన్‌ను ఫుల్ స్కాన్ చేయాలి. ముఖ్యంగా అనుమానాస్పద యాక్టివిటీ (మెసేజ్‌లు, బ్యాంక్ లావాదేవీలు) ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి.

వెంటనే మరో ఫోన్ లేదా కంప్యూటర్ సహాయంతో మీ బ్యాంకింగ్ యాప్‌లు, సోషల్ మీడియా, ఈ-మెయిల్ పాస్‌వర్డ్‌లను మార్చాలి. ఇందుకోసం అత్యంత పటిష్టమైన పాస్‌వర్డ్‌లను ఎంచుకోవాలి.

ఫోన్‌లో ఇంకా అనుమానాస్పద యాక్టివిటీ కనిపిస్తే, డేటా బ్యాకప్ తీసుకొని వెంటనే ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. చివరగా బ్యాంకు ఖాతాల్ని స్తంభింపజేసి, జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular