
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన ‘సితారే జమీన్ పర్’ సినిమాకు ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ప్రత్యేక ప్రశంసలు లభించాయి. సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు ఈ సినిమాను ఆస్వాదించిన విషయాన్ని వెల్లడించారు.
‘‘ఇది అద్భుతమైన సినిమా. అమీర్ ఖాన్ సినిమాల్లో కనిపించే ఎమోషన్, హాస్యం, సందేశం అన్నీ ఇందులో ఉన్నాయి. నవ్విస్తుందీ, ఏడిపిస్తుందీ, గట్టిగా చప్పట్లు కొట్టించేస్తుంది,’’ అంటూ మహేష్ పోస్ట్ చేశారు.
తన పోస్ట్‌లో మహేష్ బాబు ఈ సినిమా చూస్తే ఎవరైనా చిరునవ్వుతో బయటకు వస్తారనే విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేశారు. సినిమా బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
జూన్ 20న విడుదలైన ఈ చిత్రం సామాన్య ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలను కూడా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే సచిన్, షారుక్ లాంటి ప్రముఖులు ఈ సినిమాను మెచ్చుకున్నారు.
ఈ ప్రశంసలతో ‘సితారే జమీన్ పర్’ బజ్ మరింత పెరిగింది. అమీర్ ఖాన్‌కు ఇది మరొక క్లాసిక్‌గా నిలవబోతుందనే అంచనాలు కనిపిస్తున్నాయి.
