Wednesday, April 15, 2026
HomeMovie NewsLCU కి ప్రాణం పోసే ప్రాజెక్ట్ ఏది.. లోకేష్ స్కెచ్ ఏంటి?

LCU కి ప్రాణం పోసే ప్రాజెక్ట్ ఏది.. లోకేష్ స్కెచ్ ఏంటి?

lokesh-kanagaraj-cinematic-universe-next-project-plans

కోలీవుడ్ లో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ‘ఖైదీ’తో మొదలుపెట్టి, ‘విక్రమ్’ లో ఢిల్లీ, రోలెక్స్ పాత్రలను కలిపి లోకేష్ చేసిన మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది. అయితే, లోకేష్ రీసెంట్ మూవీ ‘కూలీ’ అంచనాలను అందుకోలేక ఆడియన్స్ ను నిరాశపరిచింది.

కూలీ సినిమా ఫ్లాప్ కారణంగా లోకేష్ తదుపరి ప్రాజెక్టుల విషయంలో డ్యామేజ్ జరిగింది. దీని తర్వాత వెంటనే అమీర్ ఖాన్ తో చేయాల్సిన సినిమా పోస్ట్ పోన్ అయింది. ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ‘ఖైదీ 2’ కూడా మరికొంత సమయం పట్టేలా ఉంది. అందుకే లోకేష్ అర్జెంట్ గా ఒక సూపర్ హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

L.C.U.కు ఇంకా మంచి క్రేజ్ ఉంది. ఖైదీ 2, రోలెక్స్ పాత్రల విక్రమ్ 2 వంటి సినిమాలకు పకడ్బందీ కథతో వస్తే తిరుగుండదు. కానీ అంతకన్నా ముందు లోకేష్ తన డైరెక్షన్ తో మళ్లీ ఫామ్ లోకి రావాలి. అందుకే అమీర్ ఖాన్ సినిమానే త్వరగా లైన్ లోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట.

ప్రస్తుతం డైరెక్షన్ కు గ్యాప్ ఇచ్చి నటుడిగా లోకేష్ ఒక సినిమాలో సోలో లీడ్ గా నటిస్తున్నారు. ఆ సినిమా పూర్తయ్యాక, తన నెక్స్ట్ డైరెక్టోరియల్ సినిమాపై దృష్టి పెడతారని తెలుస్తోంది. ఈసారి ఎలాంటి సినిమా తీసినా హిట్ టార్గెట్ తోనే లోకేష్ వస్తాడని అంటున్నారు.

లోకేష్ లిస్ట్ లో మన తెలుగు స్టార్స్ కూడా ఉన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కూడా లోకేష్ ఒక సినిమా చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అది నిజమైతే, ఆ సినిమాతో L.C.U. కు లింక్ చేస్తూ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేసే ఛాన్స్ లేకపోలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular