
న్యూస్ డెస్క్: ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల పోటీని తట్టుకునేందుకు దేశంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అయిన ఎల్ఐసీ (LIC) కొత్త పాలసీలతో ముందుకు వచ్చింది. పాలసీ వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఎల్ఐసీ రెండు కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్లను తీసుకొచ్చింది.
అందులో ఒకటి ఎల్ఐసీ ప్రొటెక్షన్ ప్లస్ (ప్లాన్ 886). రెండోది బీమా కవచ్ (ప్లాన్ 887).
1. ఎల్ఐసీ ప్రొటెక్షన్ ప్లస్ (ప్లాన్ 886):
- ఇది పూర్తిగా మార్కెట్ అనుసంధానం అయిన ప్లాన్.
- ఈ ప్లాన్‌లో బీమా సేవింగ్స్ రెండూ ఇమిడి ఉంటాయి.
- ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌ను ఐదు ఫండ్స్‌గా (బాండ్ ఫండ్, సెక్యూర్డ్ ఫండ్, బ్యాలెన్స్‌డ్ ఫండ్, గ్రోత్ ఫండ్, ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్) ఎంచుకోవచ్చు.
- అర్హత: 18-65 ఏళ్ల మధ్య వయసు వారికి.
- వెసులుబాటు: ఐదేళ్ల తర్వాత పాక్షికంగా మన డబ్బును ఉపసంహరించుకునే అనుమతి ఉంది.
- ప్రీమియం: రెగ్యులర్ పే, లిమిటెడ్ పే ఆప్షన్లతో చెల్లించవచ్చు.
2. ఎల్ఐసీ బీమా కవచ్ (ప్లాన్ 887):
- ఇదొక వ్యక్తిగత రిస్క్ ప్రొటెక్షన్ ప్లాన్. అంటే టర్మ్ పాలసీ తరహాలో కుటుంబాలకు ఆర్థిక రక్షణ ఇస్తుంది.
- బీమా హామీ: రూ.2 కోట్ల బీమా హామీతో పాలసీ ప్రారంభమవుతుంది. రూ.5 లక్షలు చొప్పున ఎంతైనా పెంచుకోవచ్చు. గరిష్ట మొత్తంపై పరిమిత లేదు.
- అర్హత: 18-65 ఏళ్ల వయసు వారు అర్హులు.
- చెల్లింపు: సింగిల్ పేమెంట్‌గా అయినా లేదా 5, 10, 15 ఏళ్లు ప్రీమియం అయినా చెల్లించవచ్చు.
ఈ బీమా కవచ్ ప్లాన్ టర్మ్ పాలసీ లాంటింది. కుటుంబ పెద్ద మరణిస్తే ప్రీమియం కట్టిన కుటుంబానికి 2 కోట్ల నుంచి ఎక్కువ మొత్తం ఒకేసారి లభిస్తుంది. ఎల్ఐసీ ఈ కొత్త ప్లాన్లతో ప్రజల ఆదరణ చూరగొనాలని చూస్తోంది.
