Friday, September 4, 2026
HomeNationalలారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పై కెనడా పెద్ద షాక్!

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పై కెనడా పెద్ద షాక్!

Lawrence-Bishnoi-Gang-Declared-Terrorist-Canada

న్యూస్ డెస్క్: భారత్‌తో పాటు విదేశాల్లో హత్యలు, దోపిడీలు, డ్రగ్స్ స్మగ్లింగ్‌తో పేరుగాంచిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు కెనడా పెద్ద దెబ్బ కొట్టింది. ఈ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చుతున్నట్లు కెనడా అధికారికంగా ప్రకటించింది.

ఈ నిర్ణయం తర్వాత బిష్ణోయ్ ముఠాకు చెందిన ఆస్తులు, వాహనాలు, బ్యాంకు ఖాతాలు స్తంభింపజేయబడతాయి. అనుమానిత సభ్యులపై కఠిన చట్టాలు అమలులోకి వస్తాయి. అంతేకాకుండా కెనడాలోకి ఈ గ్యాంగ్‌కు సంబంధించిన ఎవరూ ప్రవేశించకుండా ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకుంటారు.

భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇటీవల కెనడా ఎన్‌ఎస్‌ఏతో చర్చలు జరపడం ఈ నిర్ణయానికి దారి తీసిందని తెలుస్తోంది. రెండు దేశాలు ఉగ్రవాదంపై కలిసి పోరాడాలని అంగీకరించాయి.

1993 ముంబై బాంబు పేలుళ్ల తర్వాత దావూద్ ఇబ్రహీమ్‌ను ఉగ్రవాదిగా గుర్తించారు. ఇప్పుడు మరోసారి ఒక భారతీయ నేరస్థుడి గ్యాంగ్‌ను విదేశీ ప్రభుత్వం ఉగ్రవాద ముఠాగా ప్రకటించడం ఇదే తొలిసారి.

ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్ సబర్మతి జైలులో ఉన్నా, అతని సహచరులు గోల్డీ బ్రార్, రోహిత్ గొడారా ఈ ముఠా కార్యకలాపాలను నడుపుతున్నారు.

ఈ చర్య భారత్ కెనడా సంబంధాల్లో కొత్త దశకు సంకేతమని నిపుణులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular

MalCare WordPress Security Plugin - Malware Scanner, Cleaner, Security Firewall Firewall

Blocked because of Malicious Activities

Reference ID: 8799150816a9b201415551