డ్రగ్స్ కేసులో కోలీవుడ్ హీరో శ్రీరామ్ అరెస్ట్
న్యూస్ డెస్క్: తమిళ హీరో శ్రీరామ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవడంతో కోలీవుడ్‌లో కలకలం రేగింది. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన శ్రీరామ్‌ను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆయన ఏఐఏడీఎంకే మాజీ నేత ప్రసాద్ నుంచి మాదకద్రవ్యాలు కొనుగోలు చేశారన్న ఆరోపణలతో ఈ అరెస్ట్ జరిగింది.
నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు విచారణలో భాగంగా శ్రీరామ్‌ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ తర్వాత రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, రక్త నమూనాలు సేకరించారు. అనంతరం నుంగంబాక్కం పోలీస్ స్టేషన్‌కి తరలించి విచారించారు.
ఇప్పటికే డ్రగ్స్ కేసులో ప్రసాద్‌తో పాటు ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు, వారి వాంగ్మూలాల ఆధారంగా శ్రీరామ్‌ను కూడా విచారణకు పిలిపించారు. విచారణ ఇంకా కొనసాగుతోంది.
శ్రీరామ్ ‘రోజా పూలు’, ‘ఒకరికి ఒకరు’ వంటి సినిమాల ద్వారా గుర్తింపు పొందారు. తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు.
ఇప్పుడు ఆయన అరెస్ట్ వార్త తమిళ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి రానున్నాయి.
