
విజయ్ దేవరకొండ నటిస్తున్న “కింగ్ డమ్” సినిమా విడుదలకు సిద్ధమైంది. స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాణం జరగింది.
ఇప్పటికే సినిమా ట్రైలర్, సాంగ్స్‌కు మంచి స్పందన వచ్చింది. అయితే, కింగ్ డమ్ ప్రీమియర్స్ ఉంటాయని ప్రచారం జరిగినా, ఇప్పుడు నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు.
సినిమాపై ఉన్న హైప్, బుకింగ్స్ జోరు కారణంగా నేరుగా విడుదల దినం నుంచే షోలు పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. నైజాంలో ఉదయం 7 గంటల నుంచే రెగ్యులర్ షోలు మొదలవుతున్నాయని చెప్పారు.
అమెరికాలో మాత్రం బుధవారం రాత్రి 10.30 నుండి ప్రీమియర్ షోలు ఉంటాయని చెప్పారు. ఇండియాలో ప్రీమియర్స్ అవసరం లేదనిపించిందని పేర్కొన్నారు. ట్రైలర్, సాంగ్స్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకాన్ని నాగవంశీ వ్యక్తం చేశారు.
