
విశ్వనటుడు కమల్ హాసన్ ప్రతీసారీ కొత్తదనంతో వస్తాడు. ఇప్పుడు ఆయన చేస్తున్న KH237 కూడా భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈ సినిమాలో జాతీయ అవార్డు గ్రహీత స్క్రీన్ రైటర్ శ్యామ్ పుష్కరన్ జాయిన్ అవ్వడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ చిత్రానికి స్టంట్ మాస్టర్స్ అన్బరివ్ యాక్షన్ సన్నివేశాలు డిజైన్ చేస్తున్నారు. విక్రమ్, కూలీ, థగ్ లైఫ్ సినిమాల లాగా విజువల్స్‌ను కొత్త స్థాయిలో చూపించబోతున్నారని సమాచారం. కమల్ హాసన్ ఈ సినిమాలో ఫుల్ న్యూ లుక్‌లో కనిపిస్తారని మేకర్స్ హింట్ ఇచ్చారు.
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్. మహేంద్రన్‌తో కలిసి కమల్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో కళ్యాణి ప్రియదర్శన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. కమల్‌తో ఆమె ఇదే ఫస్ట్ టైమ్ పని చేయడం విశేషం.
శ్యామ్ పుష్కరన్ గతంలో మహేశింటే ప్రతీకారం, కుంబళంగి నైట్స్ లాంటి సినిమాలకు స్క్రీన్‌ప్లే రాసి క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్నారు. 2016లో నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ఆయన ఎంట్రీతో KH237కి కొత్త రేంజ్ యాడ్ అయినట్లు భావిస్తున్నారు.
ఫస్ట్ లుక్ రిలీజ్ కాకముందే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. యాక్షన్, ఎమోషన్ మేళవించిన స్టోరీతో కమల్ హాసన్ మరోసారి పాన్ ఇండియా హిట్ కోసం రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది.
