Sunday, July 19, 2026
HomeMovie Newsనేషనల్ అవార్డు వచ్చినా.. 6 నెలలు ఖాళీగా ఉన్న కీర్తి సురేష్!

నేషనల్ అవార్డు వచ్చినా.. 6 నెలలు ఖాళీగా ఉన్న కీర్తి సురేష్!

keerthy-suresh-mahanati-national-award-no-offers-6-months-career

సినిమా పరిశ్రమలో ఒక సూపర్ హిట్ వస్తే ఆఫర్లు క్యూ కడతాయి. కానీ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌కు మాత్రం కెరీర్ బెస్ట్ మూవీ ‘మహానటి’ తర్వాత ఆరేడు నెలల పాటు ఎలాంటి కొత్త ఆఫర్లు రాలేదని ఆమె స్వయంగా వెల్లడించింది.

సావిత్రి జీవితంపై తీసిన మహానటి సినిమాలో ఆమె నటనకు గాను కీర్తి సురేష్ నేషనల్ అవార్డును కూడా అందుకుంది. ఈ సినిమా కీర్తికి కొత్త కెరీర్‌ను ఇచ్చింది. నటిగా ఆమె పొందిన గుర్తింపు ఎంతో గొప్పది.

అయితే, మహానటి తర్వాత తను వరుస ఛాన్స్‌లతో బిజీగా ఉంటుందనుకుంటే, దానికి భిన్నంగా తనకు వింత ఎక్స్‌పీరియెన్స్ ఎదురైందని కీర్తి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

మహానటి తర్వాత ఇండస్ట్రీలో తనపై అంచనాలు చాలా పెరిగాయని కీర్తి చెప్పింది. ఆడియన్స్ దర్శకులు తనను స్పెషల్ క్యారెక్టర్‌ల రూపంలోనే ఊహించుకున్నారని, అందుకే తనకు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు రాలేదని పేర్కొంది.

మహానటి రిలీజ్ అయిన తర్వాత తనకు ఆరు నెలల పాటూ ఎలాంటి కొత్త ఛాన్సులు రాలేదని, ఆ గ్యాప్‌ను తాను మేకోవర్ కోసం వాడుకున్నానని కీర్తి వివరించింది.

ఓపికగా వేచి చూశాక కీర్తికి మళ్లీ ఛాన్సులు వచ్చాయి. ప్రస్తుతం స్టార్ హీరోలందరి సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఆమె నటించిన రివాల్వర్ రీటా నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular