
స్టార్ హీరోలు అభిమానుల మధ్యలో కూర్చుని సినిమా చూడటం చాలా కష్టం. అందుకే చాలామంది స్టార్లు హైదరాబాద్‌లో మానేసి, విదేశాల్లో చూస్తారు. తాజాగా కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా తాను థియేటర్‌లో సినిమా చూడటం ఎందుకు మానేశారో వివరించారు.
ఉపేంద్ర హీరోగా నటించిన తొలి సినిమా ‘ఏ’ (A) విడుదలైనప్పుడు, ఆడియన్స్‌తో కలిసి సినిమా చూడాలని ఆయన థియేటర్‌కు వెళ్లారు. కొత్త హీరో కావడంతో ప్రేక్షకులు తనను గుర్తు పట్టరని ఆయన భావించారు.
కానీ థియేటర్‌లో ఉపేంద్రను గుర్తించిన యువత, ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు. దీంతో ఉపేంద్ర థియేటర్ నుంచి బయటకు వెళ్తుంటే అభిమానులు ఆయన వెంటపడ్డారు. చివరికి పోలీసుల బందోబస్తుతో ఆయన కారు ఎక్కగలిగారు.
ఆ సంఘటన తర్వాతే తాను థియేటర్‌లో సినిమా చూడటం మానేసినట్లు ఉపేంద్ర తెలిపారు. తన కారణంగా అభిమానులు ఇబ్బంది పడకూడదనే, థియేటర్‌లోని సినిమాను చూడకుండా డిస్టర్బ్ చేయకూడదనే ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్స్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మహేష్ బాబు సైతం హైదరాబాద్‌లో మానేసి, ముంబైలో చూసేవారు. స్టార్స్‌కు అభిమానుల ప్రేమ లభిస్తుంది కానీ, థియేటర్‌లో సినిమా చూసే అదృష్టం మాత్రం ఉండదు.
గతంలో రజనీకాంత్, చిరంజీవి, రాజ్‌కుమార్ లాంటి దిగ్గజ నటుల సినిమాలు ఫస్ట్ షో చూసేవాడినని ఉపేంద్ర గుర్తు చేసుకున్నారు.
