
‘కల్కి 2’ సినిమా నుంచి బాలీవుడ్ నటి దీపికా పదుకొణే నిష్క్రమించిన విషయం తెలిసిందే. 25 శాతం అధిక పారితోషికం, రోజుకు కేవలం 7 గంటలు మాత్రమే పని చేస్తానని డిమాండ్ చేయడం వల్ల ఈ పరిణామం జరిగిందనే ప్రచారం జరిగింది.
దీపిక ఎగ్జిట్ తర్వాత ఆమె స్థానంలో స్వీటీ అనుష్కను తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. అయితే మేకర్స్ అనుష్క కంటే ఉత్తమ నటి వైపు చూస్తున్నట్లు కొత్త చర్చ మొదలైంది.
‘వారణాసి’ చిత్రంతో టాలీవుడ్‌లో లాంచ్ అవుతున్న గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (పీసీ) వైపు కల్కి దర్శకుడి దృష్టి పడినట్లు వార్తలు వస్తున్నాయి. పీసీని తీసుకుంటే సినిమాకు అంతర్జాతీయ మార్కెట్ పరంగా మరింత కలిసొస్తుంది.
ప్రియాంక చోప్రా ప్రస్తుతం రాజమౌళి వారణాసికి ఎక్కడా పనిగంటల గురించి మాట్లాడకుండా, అగ్రిమెంట్ ప్రకారం కట్టుబడి పనిచేస్తోంది. ఈ సింప్లిసిటీని గమనించిన కల్కి మేకర్స్‌కు పీసీనే సరైన ఛాయిస్ అనే ఆలోచన మొదలైంది.
పీసీని ఎంపిక చేస్తే, దీపికా పదుకొణే నిష్క్రమణకు సరైన కౌంటర్ ఇచ్చినట్లవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఛాన్స్ ఎవరికి దక్కుతుందనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు సస్పెన్సే.
