
సినీ సెలబ్రిటీలు ఏం చేసినా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన కొత్త లుక్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. జీన్స్ షర్ట్ ధరించి, స్టైల్‌గా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న ఆ ఫోటో తెగ వైరల్ అవుతోంది.
ఇటీవల మలబార్ యాడ్‌లో కనిపించిన ఎన్టీఆర్ గుబురు గడ్డం, అతి సన్నబడిన లుక్‌పై ట్రోలింగ్ జరిగింది. “ఇదేంటన్న ఇంతలా మారిపోయావ్.. అసలు గుర్తు పట్టలేకపోతున్నాం” అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
అయితే, సడన్గా ఎన్టీఆర్‌కి సంబంధించిన ఈ స్టైలిష్ ఫోటో వైరల్ అవ్వడంతో ఇప్పటివరకు ఆయన్ను ట్రోల్ చేసిన నోళ్ళన్ని మూత పడిపోయాయి. ఈ కొత్త లుక్ అద్భుతంగా ఉందని అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఈ లుక్ మార్పు వెనుక ప్రధాన కారణం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న డ్రాగన్ సినిమా. ఈ మూవీ కోసమే ఎన్టీఆర్ చాలా సన్నబడ్డారని ఆ తర్వాత అర్థమైంది. లుక్‌పై అభిమానులు ఆందోళన చెందారు.
దేవర సినిమాలో తన లుక్‌తో ఆకట్టుకున్న ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. డ్రాగన్ కొత్త షెడ్యూల్ రేపటి నుండి ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ బాడీ డబుల్ లేకుండా స్వయంగా స్టంట్స్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
